కాంగ్రెస్‌లో చేరుతున్నా, రేపు ఢిల్లీ వెళ్తున్నా, మీడియాతో వైఎస్ షర్మిల
కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ఇదివరకే నిర్ణయించామన్నారు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినందువల్లే… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారామె. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. 31 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కేవలం 10 వేల మెజార్టీతో సాధ్యమైందన్నారు. దానికి కారణం వైఎస్సార్టీపీ పోటీ చేయకపోవడమేనన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యేదన్నారు. అందువల్లే, కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు.

త్యాగానికి కాంగ్రెస్ పార్టీ విలువనిచ్చి , కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి తనకు ఏ అభ్యంతరం లేదన్న షర్మిల, కాంగ్రెస్ పార్టీ దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీని చెప్పారు. ప్రతి ఒక్కరికీ మద్దతిచ్చే పార్టీ మాత్రమేనన్న షర్మిల, కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని నిర్ణయించామన్నారు. రేపే ఢిల్లీకి వెళ్తున్నామన్న షర్మిల.. ఒకట్రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలొస్తాయన్నారు. ఈ సందర్భంగా తనయుడు, కాబోయే కోడలిని వైఎస్ షర్మిల మీడియాకు పరిచయం చేశారు. కొత్త వధువురులు సంతోషంగా ఉండాలని కోరుకోవాలని కోరిన మీడియా మిత్రులను కోరారు.

