Home Page SliderTelangana

జానీ మాస్టర్ భార్య ఓపెన్ ఛాలెంజ్..

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ కేసుపై ఆయన భార్య సుమలత అలియాస్ ఆయేషా స్పందించారు. తన భర్త తప్పు చేశారని, ఒక బాలికపై అత్యాచారం చేశారని నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన భర్త జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ప్రతిభ కలిగిన వారికి అవకాశాలు ఇచ్చేవారని పేర్కొన్నారు. ఆయనపై కంప్లైంటు చేసిన అమ్మాయికి హీరోయిన్‌గా స్థిరపడాలనే కోరిక ఉందన్నారు.  స్టేజి షోల నుండి ఆమెను సినీరంగానికి వచ్చిన ఆమెకు ఆ లగ్జరీ లైఫ్ కావాలని, తనకెక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుందన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరిగిందని ఎలాంటి సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేస్తోందన్నారు. జానీ మాస్టర్‌ ఆమెతో సన్నిహితంగా ఉండడం ఎవరైనా చూశారా? అంటూ ప్రశ్నించారు. అన్యాయం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఆమెకు, బయటకు వచ్చి మాట్లాడడానికి ఏమైంది. ఆమెపై నిజంగా లైంగికవేధింపులు జరిగితే, జానీ మాస్టర్ దగ్గర పనిచేయడం నా అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెప్పింది? ఇవన్నీ స్వార్థంతో చేసిన ఆరోపణలే అంటూ తోసిపుచ్చారు. కాగా గురువారం జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్టు చేసి, హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈరోజు ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.