పవన్‌కళ్యాణ్‌పై జోగి రమేష్ సెటైర్లు
వైసీపీ మంత్రి జోగి రమేష్ ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ..పవన్‌కళ్యాణ్‌కు ఏమాత్రం విలువలు లేవని తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌కళ్యాణ్,చంద్రబాబేనని జోగిరమేష్ ఆరోపించారు. చంద్రబాబు అధికారం కోసం ఓసారి బీజేపీని,మరోసారి పవన్‌కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంటారని తెలిపారు. మీరు దుర్మార్గులు కాబట్టే 2019 ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని పాతరేసి..వైసీపీకి పట్టం కట్టారన్నారు. మీరు చేస్తున్న దుర్మార్గాలను ప్రజలు చూస్తునే ఉన్నారని జోగిరమేష్ గుర్తుచేశారు. పవన్‌కళ్యాణ్ రాష్ట్రంలో కులాన్ని రెచ్చగోట్టే ప్రయత్నం చేస్తున్నారని జోగిరమేష్ మండిపడ్డారు. అసలు రాజకీయ పార్టీలకు కులం ఉంటుందా ఆని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలవాడు,అన్ని మతాలవాడని ,అందరివాడని జోగిరమేష్ స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఓ బిడ్డలాగా ఆయన్ని ఆదరిస్తుందని జోగి రమేష్ వెల్లడించారు.