Home Page SliderNational

జియో,ఎయిర్‌టెల్ ఛార్జీల మోత..బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్

దేశంలో జియో,ఎయిర్‌టెల్,వోడాఫోన్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను రేపటి నుంచి భారీగా పెంచనున్నాయి. దీంతో చాలామంది వేరే నెట్‌వర్క్‌కు మారాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసమే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సంస్థ సూపర్ ప్లాన్‌ను ప్రకటించింది. కొత్త కస్టమర్లను ఆకర్షించే విధంగా బీఎస్ఎన్ఎల్ రూ.249 ప్లాన్‌ను పరిచయం చేస్తుంది. ఈ ప్లాన్‌లో 45 రోజుల కాలవ్యవధితో అన్‌లిమిటెడ్ కాల్స్ ,రోజుకి 2 GB డేటా,100 ఫ్రీ SMSలు ఈ ప్యాక్‌లో అందిస్తోంది. అయితే ఇతర టెలికాం కంపెనీలు ఇదే ధరకు కేవలం 1 GB డేటాను మాత్రమే ఇస్తున్నాయి. అంతేకాకుండా ఆ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 28 రోజులుగా ఉంది.దీంతో చాలామంది జియో,ఎయిర్‌టెల్,వోడాఫోన్ వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు మారాడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.