అంత్య క్రియల్లో పాల్గొన్న జాన్వీకపూర్
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన నానమ్మ అంత్యక్రియలలో పాల్గొన్నారు. తన తండ్రి బోనీ కపూర్ తల్లి నిర్మల్ కపూర్ అనారోగ్య సమస్యలతో 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. దీనితో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఈ అంత్య క్రియలలో తన సోదరి ఖుషీకపూర్, ప్రియుడు శిఖర్ పహారియాలతో కలిసి ఆమె అంత్యక్రియలకు హాజరయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తోంది.