Andhra PradeshHome Page Slider

ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు కుట్రలంటూ జగన్ సంచలన విమర్శలు

ఏపీ సీఎం జగన్ వచ్చే సోమవారం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాటల దాడి పెంచారు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే విమర్శలుగుప్పిస్తున్న జగన్ ఇప్పుడు చంద్రబాబు, ఢిల్లీ పెద్దలంటూ కలిపి సైరన్ మోగిస్తున్నారు. ఏపీలో సంక్షేమంతో పేదల కోసం పనిచేస్తున్న తన చేతులు కట్టేయాలని చూస్తున్నారని ఈ ఆటలు మరికొన్ని రోజులు మాత్రమేనని, తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ఆపిన పథకాలన్నీ తిరిగి ఇస్తానంటూ కోరుకొండ జంక్షన్ వద్ద జరిగిన ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పింఛన్, దగ్గరుండి రాకుండా చేశారన్నారు జగన్. అవ్వాతాతలకు ఇన్నాళ్లుగా ఇంటికి నేరుగా పింఛన్ పంపితే, ఎన్నికలకు రెండు నెలల ముందు ఇంటికి రాకుండా చేశారన్నారు. వారందరూ ఇప్పుడు వైసీపీకి ఓటేయాలని జగన్ కోరారు.

జగన్ ఎప్పుడో బటన్ నొక్కితే, ఆ సొమ్మును కూడా అక్కచెల్లెమ్మలకు రాకుండా ఢిల్లీ పెద్దలతో కుట్రలు చేస్తున్నారన్నారు. తాను బటన్ నొక్కినవన్నీ కూడా ఐదేళ్లలో ప్రతి సంవత్సరం ఇచ్చిన స్కీములేనన్నారు. కొత్తగా ఇచ్చేవేమీ కాదన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం చేసినవేనన్నారు. 57 నెలలకు కాకముందే జగన్‌ను కట్టడి చేయడానికి ఢిల్లీతో కుట్రలు చేస్తున్నారన్నారు. ఇన్నాళ్లుగా ఏ పథకం ఎప్పుడిస్తుందో, ఎప్పుడు వస్తుందో, రాష్ట్ర చరిత్రలో జగన్, క్యాలెండర్ ఇచ్చాడన్నారు. చెప్పింది, చెప్పినట్టుగా ఇన్నాళ్లుగా చేశానన్నారు. ప్రతి నెల ఇస్తున్న జగన్‌ను ఇబ్బంది పెట్టడానికి కుట్రలు చేస్తే అక్కచెల్లెళ్లు ఊరుకుంటారా, అని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. ఎవరు అడ్డుకున్నా.. విజయాన్ని దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులతో చేస్తాడన్నారు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజుల్లోనే అన్ని క్లియర్ చేస్తాడన్నారు.