Andhra PradeshHome Page Slider

“రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్”:సీఎం చంద్రబాబు

ఏపీ మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ చేసిన ఘోరాలు రాష్ట్రాన్ని వెంటాడుతున్నాయన్నారు. అయితే ఇది ఎన్నేళ్లు అనేది కాలమే నిర్ణయించాలన్నారు. గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు 986 మంది పోలీసులతో భద్రత ఉండేదన్నారు. అసలు సీఎంకు అంత మంది పోలీసులతో భద్రత అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే ఇప్పుడు సీఎంగా నేను వెళ్తుంటే కూడా అధికారులు పరదాలు కట్టేస్తున్నారన్నారు. ఇవన్నీ వద్దని వారికి చెప్పానన్నారు. నాకు ఆలస్యమైనా ఫర్వాలేదు..ట్రాఫిక్ ఆపొద్దని పోలీసులకు సూచించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.