అవసరానికి వాడుకుని వదిలేయకూడదు
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన పారిశ్రామికవేత్తల కార్యక్రమంలో నితిన్ గడ్కరీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… `యూజ్ అండ్ త్రోలా వ్యవహరించొద్దు, మంచి, చెడు రెండు సమయంలోనూ పట్టుకున్న చేతిని వదలకూడదు. ఎల్లప్పుడూ చేయిని పట్టుకునే ఉండాలన్నారు. ఉదయించే సూర్యుడిని పూజించొద్దు` అని గడ్కరీ అన్నారు. స్టూడెంట్ లీడర్‌గా ఉన్న రోజులను గడ్కరీ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో మంచి భవిష్యత్తు కోసం తనను కాంగ్రెస్‌లో చేరాలని శ్రీకాంత్ జిక్కర్ కోరారన్నారు. అయితే… కాంగ్రెస్ భావజాలం తనకు నచ్చదని, పార్టీలో చేరటం కంటే బావిలో దూకి సూసైడ్ చేసుకునేందుకుకైనా సిద్ధమని చెప్పారన్నారు. అయితే.. ఈ క్రమంలో `అవసరానికి వాడుకుని వదిలేయకూడదంటూ’ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.