బెనిఫిట్ షో లేకపోవడమే మంచిది..ఫిల్మ్ ఎగ్జిబిటర్స్
తెలంగాణలో ఇకపై సినిమాల బెనిఫిట్ షోలను రద్దు చేస్తామని, ఇకపై వీటికి అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. ఇలాంటి బెనిఫిట్ షో వల్ల సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండడం లేదని అభిప్రాయపడ్డారు. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే ఉండాలన్నారు. ఈ ధరల పెంపు వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని ఆరోపించారు. అలాగే ధరలు తక్కువగా, సాధారణ రేట్లలో ఉంటినే ఎక్కువ మంది సినిమాలు చూస్తారని పేర్కొన్నారు.