అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం… అయోధ్య రామ కార్యానికి కాంగ్రెస్ దూరం…
అయోధ్యలో రామ మందిర కార్యక్రమానికి హాజరుకారాదని కాంగ్రెస్ నిర్ణయించింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో జరుగుతోందని… అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి హాజరుకాబోదని లోక్‌సభలో పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇరువురు ఈ కార్యక్రమానికి వెళ్లరని ఆయన చెప్పారు.