Andhra PradeshHome Page Slider

కోనసీమకు రైలు అందేనా?

కోనసీమలోని పల్లెటూర్లకు ఏర్పాటు చేయబడిన రైలు పనులు సంవత్సరాలుగా అరకొరగా మిగిలిపోయాయి. ఇప్పటికే కొన్ని మార్గాలలో రైల్వే లైన్లు పూర్తయి, కోట్ల రూపాయలు ఖర్ఛు చేసినా కూడా రైలు పూర్తి స్థాయిలో ప్రయాణానికి నోచుకోలేదు. రెండు కోచ్‌లతోనే ప్రారంభమైన బుజ్జిరైలు నర్సాపురం- కోటిపల్లికి కొన్నాళ్లు తిరిగినా మళ్లీ మూతపడింది. దీనితో ఉద్యమబాట పట్టాలని నిర్ణయించుకున్నారు కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు. దీనికోసం అంబాజీపేటలో అమలాపురం అర్భన్ డెవలప్‌మెంట్ అధారిటీతో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ రైలు పునరుద్ధరించాలంటూ శాంతియుత ప్రజాఉద్యమాన్ని చేయాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీలు పార్టీలకతీతంగా ఉవ్వెత్తున ఉద్యమం చేస్తేనే కోనసీమలో రైలుకూత వినిపిస్తుందని కోనసీమ రైల్వే సాధన సమితి సభ్యులు నినదించారు. రెండు కోచ్‌లతో నడిచే దీనిని అక్కడివారు ముద్దుగా ‘రైల్ బస్’ అని పిలుస్తూ ఉండేవారు.