ఐపీఎల్ టికెట్ల బుకింగ్ షూరు..
దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ టోర్నీ రానే వచ్చింది. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటికే వేదికలు సిద్ధం చేశారు. ముఖ్యంగా గత సీజన్ లో మొత్తం 13 విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మ్యాచ్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం 11 గంటలకు మార్చి 22, 27న ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. అయితే.. ఈ సీజన్ లో ప్రతి రెండు టికెట్లకు ఒక ఎస్ఆర్ హెచ్ జెర్సీని ఉచితంగా అందించనున్నట్లు సన్ రైజర్స్ ప్రకటించింది. అయితే టికెట్ ధరలు ఆన్ లైన్ లో రూ. 750 నుంచి మొదలై గరిష్టంగా రూ. 24,788గా ఉంది. అయినా టికెట్లను కొనేందుకు సన్ రైజర్స్ ఫ్యాన్స్ పెద్ద మొత్తంలో ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.