Home Page SliderNationalSports

ఐపీఎల్ 2023 షెడ్యూల్ విడుదల

మార్చి 31న ఐపీఎల్ 2023 సీజన్ ఓపెనింగ్ మ్యాచ్

గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌

మార్చి 31న ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్- 2023 ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. రెండో రోజు పోటీలో పంజాబ్ కింగ్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుండగా, లక్నో సూపర్ జెయింట్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఏప్రిల్ 2న, రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్‌తో హై-ప్రొఫైల్ పోరులో తలపడనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 2022లో ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 2023లో 12 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి, పది హోమ్ వేదికలతో పాటు ధర్మశాల, గౌహతిలో కూడా ఐపీఎల్ జరుగనుంది.

IPL 2023 మొదటి ఐదు మ్యాచ్‌లు
చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ – మార్చి 31.
పంజాబ్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడ్స్ – ఏప్రిల్ 1.
లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ – ఏప్రిల్ 1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ – ఏప్రిల్ 2.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ – ఏప్రిల్ 2