Home Page SliderTelangana

“ఫ్యూచర్ సిటీ”కి పెట్టుబడులు పెట్టండి”..రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో భాగంగా దేశం గర్వించేలా ప్రవాస భారతీయుల ఆర్థిక పెట్టుబడుల మద్దతు అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యూజెర్సీలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెట్టుబడులతో ముందుకు రావాలని  పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలకు తదుపరి దశగా మహానగరంలో ప్రపంచ స్థాయి మాస్టర్ ప్లాన్ తో అన్ని హంగులతో నాలుగవ నగరంగా మరో “ఫ్యూచర్ సిటీ”రూపుదిద్దుకోబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో భాగంగా దేశం గర్వించేలా ప్రవాస భారతీయుల ఆర్థిక పెట్టుబడుల మద్దతు అవసరమని చెప్పారు. పెట్టుబడులతో ముందుకు రావాలని  పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “భారత దేశం మన జన్మభూమి. తెలంగాణలో మీవంతుగా ఆర్థిక పెట్టుబడులు పెట్టడం ధర్మం. మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఎన్నోరెట్లు ప్రయోజనం చేకూరుతుంది. అందుకు నాదీ గ్యారెంటీ. రాష్ట్రాభివృద్ధికి మీ తోడ్పాటు, భాగస్వామ్యం ఎంతో అవసరం. అది మీకు, మీ జీవితాలకు తప్పకుండా ఎంతో సంతృప్తినిస్తుంది. తెలంగాణలో సాఫ్ట్ వేర్, ఫార్మా, ఆర్టిఫీషయల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, ఫ్యూచర్ టెక్ రంగాల్లో చైనా దేశానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎదిగేలా చర్యలు తీసుకుంటున్నాం. దానికి ప్రవాస భారతీయుల పెట్టుబడులకోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాం.” అంటూ వివరించారు.