Andhra PradeshHome Page Slider

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్

స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు 4 వారాలు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో చంద్రబాబు 53 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్ ను వచ్చే నెల 10 తారీఖున కోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 9న చంద్రబాబు నంద్యాలలో అరెస్ట్ అయ్యారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆయన దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. స్కిల్ డివలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వక నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధన పిటిషన్ వేశారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు.