ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. వడగళ్ల వర్షానికి విమానం ముందుభాగం ధ్వంసమైంది. విమానంలో ప్రయాణిస్తున్న 200 మందికి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుండి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం ముందు భాగం వడగళ్ల వర్షం వల్ల దెబ్బతినడంతో, భయాందోళనతో ప్రయాణికులు కేకలు వేశారు. పైలట్ విమానాన్ని క్షేమంగా శ్రీనగర్ లో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.