దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ భారత్ టార్గెట్ 79 పరుగులు
జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్ల ప్రదర్శనతో భారత్ దక్షిణాఫ్రికాను 176 పరుగులకు ఆలౌట్ చేసింది. రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడానికి భారత్‌కి ఇప్పుడు మొత్తం 79 పరుగులు అవసరం. ఆరు వికెట్లు పడగొట్టి, సౌతాఫ్రికా సులువుగా పరుగులు చేయనివ్వకుండా బుమ్రా హీరోగా నిలిచాడు. అయితే, ఐడెన్ మార్క్రామ్ తన సెంచరీని సాధించి, తన జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు. బుమ్రాతో పాటు, ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు.