ఐఫోన్ల ఉత్పత్తిలో భారత్ సంచలన రికార్డు
భారత్‌లో తయారైన ఐఫోన్లు రికార్డు స్థాయిలో ఎగుమతులను సాధించాయి. గత ఏడాదితో పోలిస్తే మూడవ వంతు వృద్ధి చెందాయి. యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్, పెగట్రాన్ సంస్థలు టాటా ఎలక్ట్రానిక్స్‌తో కలిసి ఒప్పందంలో ఉన్నాయి. కర్ణాటకలోని టాటా గ్రూప్ ఫాక్టరీ నుండి ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యలో 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఎగుమతులు సుమారు రూ.85 వేల కోట్ల విలువను దాటవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ చెన్నై వద్ద అసెంబ్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. భారత్ నుండి అమెరికాకు అత్యధికంగా ఎగుమతి అయ్యే రెండవ సరుకుగా ఐఫోన్ నిలిచింది.