చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ వేల్‌కుమార్
భారత అథ్లెట్ ఆనంద్‌కుమార్ వేల్‌కుమార్ స్పీడ్ స్కేటింగ్ రంగంలో అపూర్వ ఘనత సాధించాడు. నార్వే వేదికగా ఆదివారం ముగిసిన ప్రపంచ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో 42 కి.మీ మెన్స్ మారథాన్‌లో స్వర్ణం నెగ్గి కొత్త రికార్డు సృష్టించాడు. అంతకుముందు 1000 మీటర్ల స్ప్రింట్‌లోనూ బంగారు పతకం, 500 మీటర్ల స్ప్రింట్‌లో కాంస్య పతకం సాధించాడు.
ఈ పోటీల్లో రెండు సార్లు విజేతగా నిలిచిన తొలి భారతీయుడిగా చరిత్రలో తన పేరు నిలిపిన వేల్‌కుమార్.. మూడు పతకాలు గెలుచుకున్న ఏకైక భారత అథ్లెట్‌గా నిలిచాడు. ఆయన విజయాలు భారత స్పీడ్ స్కేటింగ్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించాయి. వేల్‌కుమార్ మాట్లాడుతూ,“1000 మీటర్ల స్ప్రింట్‌తో పోలిస్తే 42 కి.మీ మారథాన్ మరింత కష్టమైనది. అద్భుతమైన నైపుణ్యం, సహనం, వ్యూహాత్మక ఆలోచనలు లేకపోతే విజయం సాధ్యం కాదు. సుదీర్ఘంగా సాగే ఈ రేసును జాగ్రత్తగా ఆడుతూ ప్రపంచానికి నా సత్తా చూపించగలిగాను” అని భావోద్వేగంగా చెప్పాడు.
ఈ విజయాలతో వేల్‌కుమార్ భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ప్రతిష్ట తీసుకువచ్చాడు. అతని పై క్రీడాభిమానులు, నిపుణులు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.