Home Page SliderNational

కంటికి కన్ను.. పంటికి పన్ను.. కెనడా రాయబారిని దేశం విడిచి వెళ్లాలన్న భారత్

భారత రాయబారిని దేశం వదిలి వెళ్లాలంటూ కెనడా తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా స్పందించిన భారత్, ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా, కెనడాలో ఇండియా కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్తను భారత్ ఈరోజు బహిష్కరించింది. పేరు తెలియని దౌత్యవేత్త దేశం విడిచి వెళ్లడానికి ఐదు రోజుల సమయం ఇచ్చింది. జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంలో తమ పాత్ర ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ ఘాటుగా స్పందించింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ప్రమేయంలో భారత ప్రభుత్వ ఏజెంట్లతో ముడిపడి ఉందని, అందుకు తగిన ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు “అసంబద్ధమైనవని, ప్రేరేపించబడినవని ఇండియా ఘాటుగా రియాక్ట్ అయ్యింది.