Home Page SliderInternational

180 పరుగులకే ఇండియా ఆలౌట్

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటింగ్ తుస్సుమంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ కు దిగింది. రెండో వికెట్ కు రాహుల్, గిల్ జోడించిన 69 రన్స్ పార్ట్ నర్ షిప్ తప్ప ఇన్నింగ్స్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. 4 వికెట్ల నష్టానికి 82 పరుగులతో రెండో సెషన్ ప్రారంభించిన భారత్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ(3) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే రిషబ్ పంత్ (21) పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో అశ్విన్ 22 పరుగులు చేసి భారత్ స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాడు. అయితే స్టార్క్ మరోసారి తన బౌలింగ్ తో చెలరేగాడు. ఒకే ఓవర్ లో అశ్విన్, హర్షిత్ రానా లను ఔట్ చేశాడు.