“వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు”:జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కాగా జగన్ మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేత పిన్నెల్లిపై అక్రమంగా కేసులు పెట్టిందని ఆరోపించారు.రాష్ట్రంలోని వైసీపీ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వంలో కులం,మతం,పార్టీ చూడకుండా ప్రజలకు మంచి చేశామని జగన్ తెలిపారు.అయితే తెలుగు దేశం పార్టీ వాళ్లకు ఓటు వేయలేదనే ఒక్కే కారణంతోనే దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు.