Andhra PradeshHome Page Slider

ఏపీలో లేనోళ్లకు ఓటివ్వనంటే ఎట్లా?ఈసీకి చంద్రబాబు కంప్లైంట్

వేరే ప్రాంతానికి వెళ్లినవారికి ఓటేసే హక్కు ఇవ్వారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో పుట్టినవారు.. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారు ఓటేయొచ్చన్నారు. అవకాశాల్లేకపోవడం వల్లే వారు వలస వెళ్లారని.. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా అంటూ మండిపడ్డారు. వేరే ప్రాంతాల్లో ఉన్నారని సాకు చూపించి… ఓటు వేయకుండా జగన్ సర్కారు వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేస్తోందని ఆక్షేపించారు. ఇందుకు కొందరు అధికారులు వంతపాడుతున్నారని.. అలాంటి వారిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందిని వేయడం కరెక్ట్ కాదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న నిబంధనలనే ఏపీలో పాటించాలన్నారు. కొందరు ఆఫీసర్లపై కంప్లైంట్లు ఇచ్చామన్న చంద్రబాబు వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లోనూ, గ్రాడ్యూయేట్స్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను వివరించామన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందన్న చంద్రబాబు… ఏపీలోనే అలాగే నిర్వహించేలా ఈసీ చొరవ తీసుకోవాలన్నారు.

ఎన్నికల నిర్వహణలో అవకతవకలు లేకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినవారికి ఓటు వేసే అవకాశం కల్పించాల్సిందేనన్నారు చంద్రబాబు. ప్రతిఘటించినవారికి బెదిరింపులు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. చీఫ్ సెక్రటరీ స్థాయి ఆఫీసర్‌… కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవలని ఈసీకి చెప్పామన్నారు చంద్రబాబు. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, అరెస్ట్ చేస్తామని బెదిరించి ఎన్నికలు జరిపించుకోవాలని జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోకుంటే రాష్ట్రంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ లేనప్పుడు కూడా ఇన్ని ఘోరాలు జరగలేదన్న చంద్రబాబు.

టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి, ఈసీ పెద్దలను కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కారు దొంగ ఓట్ల దందాను ఈసీకి వివరించామన్నారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పట్నుంచి లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందన్నారు. బైండోవర్ కేసులు పెట్టి టీడీపీ, జనసేన కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నారన్నారు. పోలీసులను, అధికారులను మార్చుతున్నారన్నారు. విలేజ్ సచివాలం సిబ్బందిని ఎన్నికల్లో ఉపయోగించవద్దని స్పష్టం చేశామన్నారు. ఎన్నికలనిర్వహణ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహిస్తామని ఈసీ భరోసా ఇచ్చిందన్నారు పవన్. చాలా కాలం తర్వాత ఎన్నికల సంఘం పూర్తి సభ్యులు రావడంతో అన్ని విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు పవన్ కల్యాణ్.