Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsTrending Todayviral

అసెంబ్లీని బహిష్కరిస్తే పదవికి అనర్హులే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 60 రోజులు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై ఆటోమేటిక్‌గా వేటు పడుతుందని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై స్పందిస్తూ పులివెందులకు ఉప ఎన్నికలు రావొచ్చన్నారు. ఒక్క పులివెందుల ఏంటి? మొత్తం 11 సీట్లకు ఉప ఎన్నికలు రావొచ్చంటూ జోస్యం చెప్పారు. ప్రతిపక్ష హోదా కావాలని బతిమిలాడుకోవడం మానుకోవాలన్నారు. వారందరూ అసెంబ్లీకి రావాలని పేర్కొన్నారు. లేదంటే నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. 11 సీట్లకు ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిచినా ఉపయోగం ఉండదన్నారు రఘరామకృష్ణరాజు. అసెంబ్లీని బహిష్కరిస్తే పదవికి అనర్హులేనని చెప్పారు. ఏపీలో ప్రతిపక్ష హోదాపై మళ్లీ రచ్చ మొదలైంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు రావాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే.,. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని వైసీపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.