Home Page SliderTelangana

6 నెలలు కష్టపడితే..అధికారం మనదే:రేవంత్ రెడ్డి

తెలంగాణా టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  కాగా ఏఐసీసీ సెక్రెటరీలు బోసురాజు,నదీమ్ జావీద్‌లను అభినందిస్తూ ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని గుర్తిస్తామని రేవంత్ వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని రేవంత్ రెడ్డి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. దీనికోసం తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు,నేతలు రాబోయే 6 నెలలు కష్టపడి పని చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రానున్న ఎన్నికల్లో నేతల పనితనంతోపాటు సర్వే ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.