పెద్ద ప్యాకేజీ దొరికితే మావాళ్లు కూడా బీఆర్ఎస్ లో కలుస్తరు..
పెద్ద ప్యాకేజీ దొరికితే మావాళ్లు కూడా బీఆ ర్ఎస్ కలిసిపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాటలు తాను నిజమే అనుకుంటున్నానని తెలిపారు. రాజాసింగ్ మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో బీజేపీ క్యాండిడెడ్ ఎక్కడి నుంచి నిలబడాలనేది వాళ్లు డిసైడ్ చేస్తారు. మా పార్టీ వాళ్లు కాదు. గతంలో ఇదే జరిగింది. అందుకోసం బీజేపీ నష్టపోయింది. ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఇప్పటివరకు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ రాలేదు. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఎన్నికల్లో మా వాళ్ళు కుమ్ముకైపోయినారు అందుకోసం బీజేపీకి చాలా నష్టం జరిగింది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఈ విషయం తెలుసు. కానీ ఎవరు చెప్పరు చెబితే వాళ్లు సస్పెండ్ అయిపోతారు. అందుకోసం కార్యకర్తలు పాపం నోరు మూసుకొని కూర్చుంటారు’ అని రాజాసింగ్ అన్నారు.