కరెన్సీపై దేవతల ఫోటోలుంటే కష్టాలు పోతాయి
కరెన్సీపై హిందూ దేవతల ఫోటోలు ఉండాలన్న తన డిమాండ్‌ను సమర్థించుకుంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ` స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారు. నేటికి మన దేశంలో పేదవారి సంఖ్య ఇంత ఎక్కువగా ఎందుకు ఉంది? దేశ ప్రజలంతా కష్టపడి పని చేయడంతో పాటు మన ప్రయత్నాలు సఫలం కావాలంటే భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలి అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. మన ఆర్థిక పరిస్థితి బాలేదు. ఓ వైపు ప్రజలు కష్టపడుతున్నారు, ఇందుకు మంచి ఫలితం రావాలంటే దేవుడి ఆశీసులు మనకు తప్పనిసరి. అందుకే నోట్లపై లక్ష్మీ, గణపతి బొమ్మలను ముద్రించండి. మన కష్టాలు తీరుతాయి. 130 కోట్ల మంది భారతీయుల తరఫున ఇది నా విజ్ఞప్తి` అని లేఖలో స్పష్టం చేశారు.