మునుగోడులో టీఆర్‌ఎస్ ఓడిపోతే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా…
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలవకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలంలో ‘మన ఊరు – మన ఎమ్మెల్యే’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన ఘనమైన చరిత్ర బీజేపీకి ఉందని విమర్శించారు. మహారాష్ట్ర, గోవా ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిన చరిత్ర బీజేపీకి ఉందన్నారు.