అందితే జుట్టు అందకపోతే కాళ్లు సీఎంకి అలవాటే..
టీఆర్‌ఎస్ పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వామపక్షాల బిక్షతో మునుగోడులో టీఆర్‌ఎస్ గెలిచిందని ఎద్దేవా చేశారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు సీఎం కేసీఆర్‌కి అలవాటేనని దుయ్యబట్టారు. కేటీఆర్ నీకు దమ్ముంటే పలివెల ఘటనపై విచారణ జరిపించాలన్నారు ఈటల. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా బీజేపీ నైతికంగా విజయం సాధించిందని అన్నారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ దుష్ర్పచారాలు చేసి గెలిచిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. 2023లో రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.