వారితో మళ్లీ ఆడాలని ఉంది..ధోనీ
కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన టీమిండియా దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ ఇటీవల ఒక పాడ్ కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ఎప్పటికైనా ఛాన్స్ వస్తే, నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో మాజీ క్రికెట్ టీమ్‌లోని ఆ నలుగురు స్టార్ క్రికెటర్లు ఎవరంటే..వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూర్కర్, సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్. వీరిలో సెహ్వాగ్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ బాగా చేస్తారని పేర్కొన్నారు. సెహ్వాగ్, గంగూలీ ఆడుతుంటే ఆట చాలా అందంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లతో ధోనీ బిజీగా ఉన్నసంగతి తెలిసిందే. సీఎస్కే తరపున వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తున్నారు. తన రిటైర్‌మెంట్‌పై జవాబిస్తూ ఐపీఎల్ ముగిసేవరకూ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశారు.