నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం..
మిస్ వరల్డ్ అవ్వాలన్న కల సహకారమైందని, గెలుపు కోసం చాలా కష్టపడ్డానని థైయిలాండ్ కు చెందిన మిస్ వరల్డ్ ఓపల్ సుచాత పేర్కొన్నారు. ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నా తల్లితండ్రులు నన్ను ఎంతో సహకారం అందించారు. మా నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి, మా అమ్మ ఇల్లు చూసుకుంటుంది. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి నాకు ఎంతగానో నచ్చాయి. నాకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు’ తెలిపారు ఓపల్ సుచాత.