‘నా దగ్గర మిరాకిల్స్ ఏం లేవు’..పవన్
అన్నమయ్య జిల్లాలో మైసూరవారి పల్లిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా వద్ద మిరాకిల్స్ ఏమీ లేవన్నారు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. 13వేల పైచిలుకు పంచాయితీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. నాకు సినిమాల కంటే రాష్ట్రం ముఖ్యం. దేశం ముఖ్యం. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. గ్రామస్థాయి నుండి వచ్చిన నాయకులే దేశ నాయకులుగా ఎదిగారు. మన పంచాయితీలలో పాఠశాలలకు కనీసం ఆటస్థలాలు లేవు. 450 గజాలు మాత్రమే పాఠశాలకు స్థలం ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు పంచాయితీ పేరుతో ఉండాలి. అన్యాక్రాంతం కాకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వభూములను కబ్జా చేసేవారి కోసం గూండా యాక్ట్ పెడతాం. కాలేజీలు లేవు, ప్లేగ్రౌండ్లు లేవు. గ్రామ సభ ముఖ్యలక్ష్యం ఏంటంటే గ్రామాలలో ఏఏ ఆస్తులు ఉన్నాయి. ప్రభుత్వానికి, పంచాయితీకి ఆస్తులు ఉన్నాయో తెలుసుకోవాలి. ప్రైవేట్ వ్యక్తులను అడుక్కోవలసిన అవసరం మనకు లేదు. దాతలు ముందుకు వస్తే, పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా నిధులు తీసుకువచ్చి, అన్ని పాఠశాలలో ప్లేగ్రౌండ్లు, మౌలికసదుపాయాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను. రైల్వే కోడూరును పండ్లతోటల రాజధానిగా చేస్తాను. కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా అని పేర్కొన్నారు.