“BRS తో నాకు పంచాయితీ లేదు.. ఈసారి బీఆర్‌ఎస్‌ను కొట్టేది బీజేపీనే”-ఈటల
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన షామిర్ పేట నివాసంలో నేడు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన సతీమణి జమున కూడా ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్, హుజూరాబాద్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. ఈటల కుటుంబానికి హుజూరాబాద్ ఎమ్మెల్సీ వల్ల, కేసీఆర్ వల్ల ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఈటల రాజేందర్ కూడా తన వాదాన్ని వినిపించారు. కేసిఆర్ గారు ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదని, అన్ని పార్టీలలో గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శలు చేశారు. సచివాలయంలో ఎమ్మెల్యేలకు అనుమతి లేదు. జర్నలిస్టులకు కూడా వెళ్లే స్వేఛ్ఛ లేదు. వారు వస్తె తమ తప్పులు బయటపడతాయి అని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సర్వేలకు అందని రిజల్ట్స్ రానున్నాయి. మళ్లీ కెసిఆర్ వస్తె మా బ్రతుకులు ఆగమే అని ప్రజలు అనుకుంటున్నారని, మీకు డిపాజిట్లు కూడా రావన్నారు. కేసిఆర్ ఇతర పార్టీల మీద, నాయకుల మీద దుస్ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే, చాపకింద నీరులా బీజేపీ విస్తరిస్తోంది, ఇంటింటికి బీజేపీనీ చేరుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. నేను ప్రజల్లో ఉండే వాడిని..నాకు రక్షణ కలిపించేది పోలీసులు కాదు.. ప్రజలు. నయీం నన్ను చంపడానికి రెక్కీ నిర్వహిస్తేనే భయపడలేదు. 20 కోట్లు సుపారీ ఇచ్చా అని వారే చెప్తున్నారు. అయినా..నా జాతి భయపడే జాతి కాదు. ఉద్యమకారున్ని అని హెచ్చరించారు. హుజూరాబాద్ లో సోషల్ మీడియా లో పోస్ట్లు పెడితే కేసులు పెడుతున్నారు. చంపుతా అని వారి తల్లిదండ్రులను బెదిరిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. బీజేపీ సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదు. బీజేపీలో నేను అసంతృప్తిగా లేను. పార్టీలన్నప్పుడు బేధాభిప్రాయాలు సహజం. కేసిఆర్ ను ఓడించడమే నా లక్ష్యం.

నేను టీఆర్‌ఎస్ పార్టీ నుండి మారలేదు.. వారే బయటికి వెళ్లగొట్టారని వ్యాఖ్యానించారు. ..నేను ఏ పదవి ఆశించి బీజేపీకి రాలేదు. జీవితంలో పార్టీలు మారడం అంటే చాలా పెద్ద విషయం అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. “పెన్షన్ కాదు మా మనుమడికి ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. రైతుబందు కాదు పండిన పంటకు తగిన ధర కావాలని కోరుతున్నారు”. కౌలు రైతులు 35 శాతం మంది ఉన్నారు. వారంతా గగ్గోలు పెడుతున్నారు. కానీ కేసిఆర్ వేరే రాష్ట్రాలకు పోయి ” అబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అంటున్నారు. కానీ ఇక్కడ జరిగేది వేరు. తెలంగాణలోనే రైతులు కేసిఆర్ కి దూరం అయ్యారని ఎద్దేవా చేశారు.
.