Home Page SliderNational

నేను బతికే ఉన్నాను..

గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం థానే జిల్లాలోని కల్హర్ లో ఉన్న ఓ ఆసుపత్రిలో చేరారు. మూత్రనాళాల ఇన్ఫెక్షన్ తో అతడు ఆసుపత్రిలో చేరగా వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందంటూ ప్రచారం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తన ఆరోగ్య పరిస్థితిపై కాంబ్లీ తాజాగా స్పందించారు. వైద్యుల వల్ల తాను బతికే ఉన్నానని తెలిపారు. హాస్పిటల్ బెడ్ పై తన వైద్య బృందంతో కలిసి కాంబ్లీ వీడియో ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ కాంబ్లీ రీలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. ప్రముఖ మాజీ క్రికెటర్ సచిన్ టెండ్కూలర్ ను కాంబ్లీ థాంక్స్ చెప్పారు. కష్ట కాలంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు వినోద్ కాంబ్లీ.