అక్రమనిర్మాణాల నివారణకు హైడ్రా మరో కీలక నిర్ణయం..
చెరువులను కబ్జా చేసి, అక్రమనిర్మాణాలు కట్టే వారికి చెక్ పెట్టేందుకు హైడ్రా మరో ముందడుగు వేసింది. అసలు చెరువుల బఫర్ జోన్లలో ఉండే ఇళ్లకు బ్యాంకులు గానీ, ఫైనాన్స్ కంపెనీలు కానీ లోన్లు ఇవ్వకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఎన్‌ఓసీ కూడా ఈ నిర్మాణాలకు అవసరమే అని నిర్థారించింది. సాధారణంగా లే అవుట్ కాపీ, బిల్డింగ్ పర్మిషన్, ఈసీ ఉంటే బ్యాంకులు గృహరుణాలు మంజూరు చేస్తాయి. ఇకమీదట ఇతర వివరాలను కూడా గమనించేలా మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసుల సత్వర పరిష్కారానికి లీగల్ టీమ్‌ను కూడా సిద్దం చేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కూడా హైడ్రా పరిశీలిస్తోంది.