ఖాజాగూడలో హైడ్రా.. కూల్చివేతలపై వ్యాపారుల ఆగ్రహం
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి సిద్ధమైంది. ఇవాళ ఖాజాగూడ భగీరథమ్మ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేయిస్తున్నారు. ఖాజాగూడా చెరువులో నాలుగు ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్, 20కి పైగా దుకాణాలను తొలగించారు. భగీరధమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు చేయడంతో పాటు భగీరథమ్మ చెరువు ఆక్రమణలపై స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.