ఏపీ ఎమ్మెల్యే కబ్జాకు హైడ్రా బ్రేక్..
ఏపీలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కబ్జాకు హైదరాబాద్‌లోని హైడ్రా బ్రేక్ వేసింది. కొండాపూర్ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఆయన అక్రమ కట్టడాలు చేపడుతున్నట్లు సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు ఆ స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను కూల్చి వేసింది. ఆయన కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిరోధించారు. వసంత హౌస్ పేరుతో ఏర్పాటు చేసిన ఆఫీస్, భారీ షెడ్లను శనివారం తొలగించారు. హఫీజ్ పేట, మాదాపూర్‌లలో కూడా వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జాలు చేసినట్లు హైడ్రా గుర్తించింది. దీనిపై విచారణ చేపట్టింది.