భారీ ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు..15మంది మృతి
భారీ ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో ఉత్తరాఖండ్‌లో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. చమోలీ జిల్లాలోని నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపైన గల వంతెనకు ఈ ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీనిలో ఒక పోలీస్ ఎస్సై, హోం గార్డులు కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని భారీ వర్షాలు, వరదల కారణంగా చమోలీ, హరిద్వార్, రుద్రప్రయాగ్‌తో సహా పలు జిల్లాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ పరిస్థితిలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో బద్రీనాథ్ హైవేపై ఉన్న ఔట్ పోస్ట్ ఇన్ చార్జి కూడా ప్రాణాలు కోల్పోయారని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారు సీఎం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.