భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాలు..
భారత్ రైల్వే భారీ సంఖ్యలో ఉద్యోగాలను ప్రకటించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. రైల్వేలో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటీస్ రిలీజ్ చేసింది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకూ 3,445 అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు, సెప్టెంబర్ 14 నుండి అక్టోబర్ 13 వరకూ 8,113 గ్రాడ్యుయేట్ పోస్టులకు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.