విద్యుత్ ఉద్యోగుల భారీ విరాళం
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రూ.18.69 కోట్ల చెక్కును అందించారు. 70,585 విద్యుత్ శాఖ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఒకరోజు మూల వేతనాన్ని పోగేసి రూ.18.69 కోట్లు సమకూర్చారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో ఇవాళ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, జేఎండీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.