BusinessHome Page SliderTelangana

మూడు డివిజన్ లలో అమ్మకానికి హౌసింగ్ బోర్డ్ స్థలాలు

గ్రేటర్‌ పరిధిలో కొన్నేళ్లుగా అక్కడక్కడా మిగిలిపోయిన హౌసింగ్‌ బోర్డు స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని అధికారులు నిర్ణయించారు. మూడు డివిజన్ల పరిధిలోని 73 ప్లాట్లను విక్రయానికి పెట్టింది. అన్నీ కలిపి 4,880.98 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నాయి. అతితక్కువగా 6.11 చదరపు గజాలు, అత్యధికం 290 చదరపు గజాలు ఉన్నాయి.కేవలం 15 స్థలాలు మాత్రమే వంద చదరపు గజాలు, అంతకుమించి ఉన్నాయి. ఇవి కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు పరిధిలోనే నాలుగు ఫేజుల్లోమూడు డివిజన్ లలో అమ్మకానికి హౌసింగ్ బోర్డ్ స్థలాలుఉన్నాయి. గతంలో వేలం వేసిన సందర్భంగా చిన్న చిన్న ప్లాట్లు మిగిలిపోయాయి. వీటితోపాటు గతంలో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాని వాటిని తాజాగా గుర్తించి విక్రయానికి పెట్టారు. వాటి విక్రయం ద్వారా రూ.60 కోట్ల నుంచి రూ. 65 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. ఈ నెలలో రెండు దఫాలుగా 31, వచ్చే నెల అయిదో తేదీన మిగిలిన 42 స్థలాలను వేలం వేయాలని నిర్ణయించారు.


మార్చిలో మరోసారి… ఈ ఏడాది మార్చిలో మరోసారి పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్న ప్లాట్లు, ఫ్లాట్లు, అసంపూర్తిగా ఉన్న బహుళ అంతస్తులను వేలం వేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం స్వల్ప విస్తీర్ణంతోపాటు కొన్నేళ్లు ఖాళీగా ఉన్న వాటిని విక్రయించటం ద్వారా ఆయా ఫేజుల్లో వేలం ప్రక్రియ పూర్తి చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాన్ని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మార్చిలో సుమారు రెండు వేలకు పైగా స్థలాలు వేలం పరిధిలోకి తీసుకురానున్నట్లు వివరించారు.