NationalTrending Today

OTTలోకి బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ చిత్రం, స్ట్రీమింగ్ ఎప్పుడంటే…

తాజాగా బాలీవుడ్ చిత్రం స్త్రీ-2 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే . 2018 లో విడుదలైన స్త్రీ మూవీకి సీక్వెల్ ఇది. వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 750 కోట్లు వసూలు చేసిందని సమాచారం. అయితే ఈ సినిమా OTTలోకి రావడానికి సిద్దమైంది. సెప్టెంబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ హర్రర్ కామెడీ మూవి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించగా ప్రధాన పాత్రధారులుగా శ్రధ్ధ కపూర్, రాజ్ కుమార్ రావ్ నటించారు. కీలక పాత్రల్లో అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి అలరించారు.

త్వరలోనే స్త్రీ -2 OTT రిలీజ్ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ రానున్నట్లు సమాచారం.