వందేళ్లలో ఈ ఏడాదే అత్యధికంగా భానుడి భగభగలు
ఈ ఏడాది శివరాత్రి కంటే ముందే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ మార్చి నుండి మూడు నెలలు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది. 1901 నుండి 2025 వరకూ గత వందేళ్ల పైనే సరాసరి ఎండ తీవ్రత తీసుకుంటే ఈ ఏడాది విపరీతంగా ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణతో పాటు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో భానుడి భగభగలు ఉండే అవకాశాలున్నాయని వెల్లడించింది. దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. దాదాపు ఈ వేసవికి 44 నుండి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.