రాజమండ్రిలో టెన్షన్..టెన్షన్
అమరావతి రైతుల పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆజాద్ చౌక్‌కు చేరుకున్న పాదయాత్ర. అయితే అమరావతి పాదయాత్ర ఆజాద్ చౌక్‌కు చేరగానే గోబ్యాక్ అంటూ.. వికేంద్రికరణ మద్దతుదారుల నినాదాలు మిన్నంటాయి. ఆజాద్ చౌక్‌లో వికేంద్రికరణ మద్దతుదారుల అమరావతి రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అమరావతి పాదయాత్రను వ్యతిరేకిస్తూ..వికేంద్రీకరణ మద్దతుదారులు నల్లబెలూన్లను ప్రదర్శించారు. అంతేకాకుండా అక్కడ వైసీపీ,టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీ కార్యకర్తలు పోటాపోటి నినాదాలు చేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ మేరకు ఆజాద్ చౌక్‌లో పోలీసులు భారీగా మోహరించి,ఇరువర్గాలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

