Andhra PradeshHome Page Slider

సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయొద్దన్న హైకోర్టు

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిగింది. అవినాష్ రెడ్డిపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు సీబీఐకి సూచించింది. ఇప్పటి వరకు విచారించిన ఆడియో, వీడియో రికార్డులను హార్డ్ డిస్క్ రూపంలో సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. హత్య స్పాట్‌లో లభించిన లెటర్, దానికి సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును సమర్పించాలని హైకోర్టు కోరింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయొద్దంటూ సీబీఐకి తెలంగాణ హైకోర్టు పేర్కొంది. వివేకా హత్య కేసు విచారణ వివరాలను సోమవారం సమర్పించాలంది. మూడోసారి ఇవాళ సీబీఐ ముందుకు విచారణకు వస్తున్న అవినాష్ రెడ్డి.. హైకోర్టును ఆశ్రయించారు. తనపై సీబీఐ తీవ్రమైన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. విచారణ సందర్భంగా తీవ్రమైన చర్యలంటే ఏంటో చెప్పాలని అవినాష్ రెడ్డి న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. అరెస్టు చేయొద్దని న్యాయస్థానాన్ని కోరుతున్నారా అని వ్యాఖ్యానించింది.