Andhra PradeshHome Page Slider

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టు షాక్

కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఇప్పటి వరకు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో ఊరట పొందిన అవినాష్‌కు ఇక మినహాయింపులు కుదరవని హైకోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశించాలని కోరిన పిటిషన్‌ను తిరస్కరించింది. కేసు విచారణపై తాము స్టే ఇవ్వలేమంది. అయితే మొదట్నుంచి అవినాష్ రెడ్డి కోరుతున్నట్టుగా ఈసారి సీబీఐకి కొన్ని ఆదేశాలిచ్చింది. సీబీఐకి కేసు దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతిస్తూనే విచారణను ఆడియో, వీడియో తీయాలని స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది.