అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
అంగళ్లు హింస కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అన్నమయ జిల్లాలోని అంగళ్లు గ్రామంలో ఆగస్టు 4న జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి చంద్రబాబుతోపాటుగా, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.