Home Page SliderTelangana

గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను గుర్తించిన హైకోర్టు

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని హైకోర్టు నిర్ధారించింది. గత ఎన్నికల్లో డీకే అరుణపై పోటీ చేసి కృష్ణమోహన్ విజయం సాధించారు. మొత్తంగా డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. గత ఎన్నికల్లో డీకే అరుణ రెండో స్థానంలో నిలిచారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని గతంలో డీకే అరుణ కోర్టులో పిటిషన్ వేశారు.