కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఆపేయాలని హైకోర్టు ఆదేశం
కామారెడ్డి బృహత్ ప్రణాళిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిటిషన్‌పై, సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారించింది. ఐతే మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి మాస్టర్ ప్లాన్ నిలిపేశామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకున్నప్పుడు ఎందుకు రద్దు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు కామారెడ్డి రైతులకు న్యాయం చేశారంటూ కేఏపాల్, హైకోర్టు సీజేఐ ఫ్లెక్సీకు రైతులు పాలాభిషేకం చేశారు.
