విశాఖ హయగ్రీవ భూములపై హైకోర్టు విచారణ
విశాఖలోని హయగ్రీవ భూములలో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు విశాఖ హాయగ్రీవ భూములపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భూముల వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో వృద్ద,అనాధాశ్రమాలకు స్థలాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలాల వద్ద వృద్ధ,అనాధాశ్రమాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ నిర్మాణ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పిటిషనర్ వాదించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయినప్పటికీ ఈ నివేదికపై ఎందుకు చర్యలు చేపట్టలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది.